Friday, December 20, 2024

సిఎం సహాయనిధి పేదలకు కొండంత భరోసా

- Advertisement -
- Advertisement -

మరిపెడ: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసానిస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బీచ్‌రాజుపల్లి గ్రామంలోని తన స్వగృహంలో బావోజిగూడెం గ్రామానికి చెందిన గుండాల ఉపేందర్‌కు మంజూరైన రూ.43,500 సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం సహాయ నిధితో నేడు నిరుపేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకుంటున్నారని తెలిపారు. నిరుపేదల ఆరోగ్య విషయంలో సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. సిఎం కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నాయన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టి సెల్ మరిపెడ మండల అధ్యక్షులు అజ్మీర రెడ్డినాయక్, నాయకులు దిగజర్ల శ్రీనివాస్, మేక దేవేందర్, కొంపెల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News