Monday, December 23, 2024

రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:ముఖ్యమంత్రి ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సం పూర్ణ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెం కట్‌రెడ్డి అన్నారు. నార్కెట్‌పల్లి మండల కేంద్రంలోని హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి ప్రజలను మో సం చేస్తూ తప్పుడు సమాచారంతో పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కరెంటుపై నిజా నిజాలు తేటతెల్లం చేశామని,తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్‌పై రోజురోజుకు నమ్మకం పెరుగుతుందని, కర్నాటక మాదిరిగా అనేక సంక్షేమ పథకాలు అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు పరిపాలన చే స్తుందో చూపిస్తామని వివరించారు.తెలంగాణలో రైతులు మూడు పంటలతో సంతోషంగా ఉన్నారని, అలాంటప్పుడు మూడుసార్లు రైతు బంధు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.

అదేవిదంగా ఇప్పటివరకు ఎంతమందికి రైతు బంధు ఇచ్చారో వివరాలు ప్రజలము ందు పెడ తాం అన్నారు. ఎంతో చరిత్ర ఉన్ననార్కెట్‌పల్లి ఆర్టీసి డిపోను ఎత్తివేయవద్దని ఆర్టీ సి ఎండి సజ్జనార్‌ను కోరారు.డిపోస్థలంలో ఎలాంటి కాంప్లెక్స్‌లు , మాల్స్ నిర్మించకుండా ఉండాలని చెప్పానన్నారు. కరెంటు అధికారుల నిర్లక్షం కారణంగా రైతులు విద్యుత్ షాక్‌తో చనిపోతున్నా సిఎం కెసిఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.

రాష్ట్ర ంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేఅని, బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల ఊశయ్య,నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు వేదాంత్ శ్రీధర్ ,దైద రవీందర్, జెర్రిపోతుల భరత్ గౌడ్ ,దార యాదయ్యలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News