Monday, December 23, 2024

ఆర్టిసి బస్సు..ఆటో ఢీ

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ : ఆర్టిసి బస్సు, ఆటో ఢీ కొన్న ఘటనలో గడ్డికోపుల రాముడు(45) అనే కూరగాయల వ్యాపారి మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేట స్టేజ్ వద్ద జరిగింది. ఎస్సై రాజు యాదవ్ తెలిపిన వివరాల మేరకు పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన గడ్డికోపుల రాములు పెద్దకొత్తపల్లిలో ప్రతి మంగళవారం జరిగే వారాంతపు సంత సందర్భంగా కూరగాయలు తీసుకువచ్చేందుకు కొల్లాపూర్‌కు ఆటోలో వెళ్తున్న సమయంలో పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేట స్టేజి సమీపంలో జటప్రోలు నుంచి కొల్లాపూర్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్న ఆర్టిసి బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొనడంతో రాముడు అక్కడికక్కడే మృతి చెందాడు.

కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, గాలుల కారణంగా రోడ్డు పక్కన ఉన్న చెట్టు కొమ్మలు రోడ్డుకు ఒరగడంతో అవి బస్సుకు తగలగా బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొనడంతో రాముడు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. మృతుడు కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించే వ్యాపారి కావడంతో అతని కుటుంబం రోడ్డున పడింది. మృతునికి భార్య చిట్టెమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు యాదవ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News