Sunday, September 22, 2024

పరవళ్లు తొక్కుతున్న చెక్ డ్యాంలు

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : దేవరకద్ర నియోజకవర్గం బండర్‌వల్లి చెక్ డ్యాంలో సంవత్సరం పొడవునా నీరు నిల్వ ఉండటంతో రెండు పంటలకు సాగునీరు అందుతుంది. దేవరకద్ర నియోజకవర్గంలో చెక్ డ్యాంల నిర్మాణం వల్ల పెరిగిన భూగర్భ జలాలు, బోర్లు రీచార్జీ అయ్యాయి. కొత్తగా వందల ఎకరాలు సాగులోకి వచ్చాయి.

చిన్నచింతకుంట మండలం బండ్రవల్లి గ్రామంలో పాత బ్రిడ్జిను వృధాగా పోనివ్వకుండా కేవలం 60 లక్షల నిధులతో చెక్ డ్యాంను నిర్మించడంతో దాదాపు 2 కిలో మీటర్ల మేర 365 రోజులు నీళ్లు నిల్వ ఉండటం, రైతాంగం రెండు పంటలను సంతోషంగా పండించుకుంటున్నారు. వాగు పరిసర ప్రాంతాల భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయి. 2018లో మార్గ మధ్యలో వెళ్తున్న హరీష్‌రావు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బండ్రవల్లి పాత బ్రిడ్జిను చూపించడంతో వెంటనే నిధులు మంజూరు చేసి చెడ్ డ్యాంను నిర్మించడం జరిగింది.

చెక్ డ్యాం నిర్మించడం వల్ల దాదాపు కొన్ని వేల ఎఖరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. దేవరకద్ర నియోజకవర్గంలో 30 చెక్ డ్యాంలు మంజూరు అవ్వగా ఇప్పటికి 21 చెక్ డ్యాంలు నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఇంకా 9 చెక్ డ్యాంలు పనులు కొనసాగుతున్నాయి.

వర్షాలు కురుస్తున్న సందర్భంగా చెక్ డ్యాంలు నిండి వరవళ్లు తొక్కుతున్నాయి. నియోజకవర్గంలో గతంలో వర్షాలు లేక కరువు ప్రాంతంగా ఉండేది. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృషితో చెక్ డ్యాంలో ఏర్పాటు చేయడం వలన భూగర్భ జిల్లాలు విపరీతంగా పెరిగాయి. దీంతో రైతులు రెండు పంటలు సమృద్దిగా పండించుకొని సంతోషంగా ఉంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News