కాళేశ్వరం: కొన్ని రోజులుగా మహారాష్ట్ర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాల కారణంగా భారీ వరద నీరు చేరడంతో త్రివేణి సంగమం వద్ద గోదావరి పెరుగుతుంది. అన్నారం గేట్లు ఎత్తడం ప్రాణహిత నది నుండి భారీ వరద నీరు చేరుకోవడంతో గోదావరి 11 మీటర్ల ఎత్తున ప్రవహిస్తుందని సిడబ్లూసి అధికారులు తెలిపారు.
అలాగే ప్రాణహిత నది నుండి వరద నీరు చేరడంతో లక్ష్మి బ్యారేజ్ వద్ద 75 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. లక్ష్మి బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 5లక్షల 79వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 5లక్షల 79వేల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 5 లక్షల 79వేల క్యూసెక్కులు ఉంది. 75గేట్లు ఎత్తడంతో ప్రస్తుతానికి లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఎలాంటి నీటి నిల్వ లేదు. అలాగే సరస్వతి బ్యారేజ్ వద్ద మానేరు నుండి భారీ వరద రావడంతో లక్ష్మి బ్యారేజ్ 65గేట్లకు గాను 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
సరస్వతి బ్యారేజ్ వద్ద లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 79వేల ఔట్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి సరస్వతి బ్యారేజ్ వద్ద ఏడు టిఎంసిల నీటి నిల్వలు ఉన్నట్లు తెలుస్తుంది.