యాదాద్రి భువనగిరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. మంగళవారం 21 రోజుల హుండీ లెక్కింపులో రూ.1,64,34,524 (1 కోటి 64 లక్షల, 34 వేల, 524) రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో మిశ్రమ బంగారం 86 గ్రాములు, మిశ్రమ వెండి 2 కేజీల 750 గ్రాములు వచ్చింది.
హుండీలో విదేశీ రూపాయలు అమెరికా 2368 డాలర్లు, ఆస్ట్రేలియా 25 డాలర్లు, కెనడా 20 డాలర్లు, యూఏఈ 35 దిరామ్స్, రియల్స్ 11, కతార్ 13, యూరప్ 30, కువైట్ 11, మలేషియా 1, విటినుం 70,000, ఇంగ్లాండ్ 20, సింగపూర్ 2, భూటాన్ 3, నే పాల్ 100, ఫ్రాన్స్ 20, ఈస్ట్ ఆఫ్రికా 100 కానుకరూపంలో వచ్చినట్లు తెలిపారు. ఈ ఆలయ ఉండి లెక్కింపు ఆలయ ఈఓ గీత, దేవాదాయ శాఖ ఆధికారుల పర్యవేక్షణలో కొనసాగగా ఆలయ ఉద్యోగ సిబ్బంది తదితరులు ఈ హుండి లెక్కింపులో పాల్గొన్నారు.
నిత్యరాబడి..
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా మంగళవారం రూ.9,12,657 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తె లిపారు. నిత్యరాబడిలో అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.