Saturday, November 23, 2024

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే జేడీ (ఎస్) పోటీ : దేవెగౌడ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(ఎస్) ఒంటరి గానే పోటీ చేస్తుందని పార్టీ అధినేత హెచ్‌డి దేవెగౌడ మంగళవారం స్పష్టం చేశారు. కానీ ఇటీవల జెడి(ఎస్), బీజేపీ మధ్య కొన్ని సర్దుబాటు ఎంపికలు కుదిరే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. పరిస్థితిని బట్టి పార్టీ తన కార్యాచరణను భవిష్యత్తులో నిర్ణయిస్తుందన్నారు. ఈనెల మొదట్లో బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశానికి బీహార్ సిఎం నితీశ్ కుమార్ తాను హాజరు కావాలని ఆశించినా, కర్ణాటక లోని కాంగ్రెస్‌లో ఓ వర్గం దాన్ని వ్యతిరేకించిందని చెప్పారు.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

కర్ణాటక లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తుందని దేవెగౌడ కుమారుడు , మాజీ సిఎం హెచ్‌డి కుమారస్వామి గత వారం ప్రకటించడం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జెడి(ఎస్) పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలు చెలరేగాయి. అయితే మంగళవారం పాత్రికేయుల సమావేశంలో దేవెగౌడ తమ పార్టీ ఒంటరి గానే పోటీ చేస్తుందని, అయిదు, లేదా ఆరు, లేదా ఒక్కసీటు గెలిచినా ఫర్వాలేదని స్పష్టం చేశారు. బలంగా ఉన్న చోటే కార్యకర్తలతో సంప్రదించి అభ్యర్థుల్ని నిలబెడతామన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము ఎలా మద్దతు ఇచ్చిందీ గుర్తు చేశారు.

జులై 17న బెంగళూరులో విపక్షాల సమావేశం జరిగినప్పుడు ఎందుకు తనను పిలవలేదని ప్రశ్నించగా, కర్ణాటక లోని కాంగ్రెస్‌లో ఓ వర్గం దేవెగౌడ హాజరైతే తాము హాజరు కాబోమని బెదిరించారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో జెడి(ఎస్)కు కేవలం 19 సీట్లే వచ్చిన నేపథ్యంలో దేవెగౌడ మాట్లాడుతూ 1983 నుంచి తమ పార్టీ మనుగడ సాగిస్తోందని, అది కొనసాగుతుందని చెప్పారు. పార్టీ పని అయిపోందని ఎవరైతే ఆలోచిస్తారో వారు భ్రమలో ఉన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News