ఉప్పల్, విశాఖలలో ఆస్ట్రేలియాతో టి20 పోరు
ముంబై: టీమిండియా 202324లలో సొంత గడ్డపై ఆడే ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఖరారు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి వచ్చే ఏడాది మార్చి ఏడు వరకు భారత్ ఆడే సిరీస్‌ల వివరాలను బిసిసిఐ మంగళవారం వెల్లడించింది. ఈ క్రమంలో భారత్ సొంత గడ్డపై ఆస్టేలియా, అప్ఘనిస్థాన్, ఇంగ్లండ్‌లతో సిరీస్‌లను ఆడనుంది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్‌లో భారత్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడనుంది.
Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి
ఇందులో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కూడా ఉంది. అంతేగాక మూడు వన్డేలు, మరో 8 టి20 మ్యాచ్‌లను భారత్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌లో భారత్ మూడు వన్డేలు, ఐదు టి20లలో తలపడనుంది. ఇక విశాఖపట్నలో నవంబర్ 23న తొలి టి20 మ్యాచ్, డిసెంబర్ 3న హైదరాబాద్‌లో ఐదో చివరి టి20 మ్యాచ్‌ను భారత్ ఆడుతుంది. ఇక వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ ఢీకొంటోంది. ఇక అఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ కూడా భారత్ ఆడనుంది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్
మొదటి వన్డే 22 సెప్టెంబర్ 2023 మొహాలి
రెండో వన్డే 24 సెప్టెంబర్ 2023 ఇండోర్
మూడో వన్డే 27 సెప్టెంబర్ 2023 రాజ్‌కోట్
టి20 సిరీస్
మొదటి టి20 23 నవంబర్ 2023 వైజాగ్
రెండో టి20 26 నవంబర్ 2023 త్రివేండ్రం
మూడో టి20 28 నవంబర్ 2023 గౌహతి
నాలుగో టి20 01 డిసెంబర్ 2023 నాగ్‌పూర్
ఐదో టి20 03 డిసెంబర్ 2023 హైదరాబాద్
అఫ్ఘనిస్థాన్‌తో టి20 సిరీస్
మొదటి టి20 11 జనవరి 2024 మొహాలి
రెండో టి20 14 జనవరి 2024 ఇండోర్
మూడో టి20 17 జనవరి 2024 బెంగళూరు
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్
మొదటి టెస్టు 25 జనవరి 2024 హైదరాబాద్
రెండో టెస్టు 02 ఫిబ్రవరి 2024 వైజాగ్
మూడో టెస్టు 19 ఫిబ్రవరి 2024 రాజ్‌కోట్
నాలుగో టెస్టు 27 ఫిబ్రవరి 2024 రాంచీ
ఐదో టెస్టు 11 మార్చి 2024 ధర్మశాల