Tuesday, December 24, 2024

మీరెలాగైనా పిలవండి.. మేము భారతీయులం: రాహుల్ ఎదురుదాడి

- Advertisement -
- Advertisement -

కాగా విపక్ష కూటమిపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు.మణిపూర్‌కు అయిన గాయాన్ని నయం చేసేందుకు ప్రతిపక్ష కూటమి సాయం చేస్తుందన్నారు.‘ మోడీజీ..మీరు మమ్మల్ని ఏ విధంగానైనా పిలవండి.మేము మణిపూర్‌కు అయిన గాయాన్ని తుడవడానికి , అలాగే అక్కడి ప్రతి మహిళ, చిన్నారి కన్నీళ్లను తుడవడానికి సాయం చేస్తాం. ప్రజలందరినీ శాంతి, ప్రేమను తిరిగి తీసుకు వస్తాం. మణిపూర్‌లో భారత దేశపు ఆత్మను పుర్నిర్మిస్తాం’ అని రాహుల్ తన ట్వీట్‌లో ఘాటుగా స్పందించారు.

కాగా ప్రతిపక్షాల కూటమినుద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ, తాము మండిపోతున్న మణిపూర్ గురించి మాట్లాడుతుంటే ప్రధాని మాత్రం ఈస్టిండియా కంపెనీ గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ దేశాన్ని, స్వాతంత్య్ర యోధులను అవమానిస్తున్నారని కాంగ్రెస్ ఎంపి రణదీప్ సుర్జేవాలా విమర్శించారు. అమెరికా పార్లమెంటులో మాట్లాడేందుకు మోడీకి సమయముంటుంది కానీ దేశ పార్లమెంటులో మణిపూర్ గురించి మాట్లాడేందుకు ఆయనకు సమయముండదని ఆక్షేపించారు. భారత రాజ్యాంగం, పార్లమెంటును ప్రధాని ఎందుకు ద్వేషిస్తారని ఆయన ప్రశ్నించారు.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

మణిపూర్ అంశంపై చర్చ విషయంలో రాజ్యసభలో సభా నాయకుడు , కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది.సభ మధ్యాహ్నం సమావేశమైనప్పటినుంచి ప్రతిపక్ష సభ్యులు, ‘మణిపూర్,మణిపూర్’ అంటూ నినాదాలు చేయసాగారు. మణిపూర్‌పై రూల్ 267 కింద చర్చకు 50 మందికి పైగా సభ్యులు నోటీసులు ఇచ్చారని, అయితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని ఖర్గే అన్నారు. దీనిపై పీయూష్ గోయల్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా ఈ అంశంతో పాటుగా రాజస్థాన్‌లో మహిళలపై జరిగిన అత్యాచారాలకు సంబంధించిన అంశాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

వాస్తవాలు చెప్పడానికి హోంమంత్రి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘మణిపూర్‌తో పాటుగా రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లాంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి చర్చించాలని మేము కోరుకుంటున్నాం. దేశంలో జరుగుతున్న ఘటనలపై మేము ఆందోళన చెందుఉతన్నాం. రాష్ట్రప్రభుత్వాలు వీటికి జవాబుదారీ కావాలని మేము భావిస్తున్నాం’ అని గోయల్ అన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం ఇరు పక్షాల మధ్య గొడవ మొదలవడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News