Monday, January 20, 2025

ప్రతి గ్రామంలో చెత్త ట్రాక్టర్లు ప్రతిరోజు చెత్త సేకరించేలా చూడాలి

- Advertisement -
- Advertisement -
  • పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలి
  • జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ

సిద్దిపేట: ప్రతి గ్రామంలో చెత్త ట్రాక్టర్లు ప్రతిరోజు చెత్త సేకరించేలా చూడాలని జడ్పీ చైర్‌పర్సన్ రోజా శర్మ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో 2,3,4వ స్థాయి సంఘం సమావేశాలను జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. మూడో స్థాయి సంఘం వ్యవసా యం సమావేశంలో సిద్దిపేట జిల్లాలో ఈ సంవత్సరంలో రైతు ఖాతాలో ఎంత జమ అయిందని అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు, రైతుబీమాకు సంబంధించిన వివరాలు జిల్లా అధికారికి అడిగి తెలుసుకున్నారు. రెండు ల క్షల 97 వేల 700 మంది రైతులకు 2.41 కోట్లు రైతుబంధు జమ అయిందని తెలిపారు. ఆగస్టు 5వ తేది వరకు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం జడ్పిటిసి కొండల్ రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు ఎంత మందికి వచ్చాయని అడడగా 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

రెండవస్ధాయి సమావేశంలో పెన్షన్లు కొత్తగా ఆప్లై చేసుకోవడానికి అన్ని లాగిన్‌లు క్లోజ్ ఆయ్యాయని ఒక విడో పెన్షన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి మాత్రమే ఆన్‌లైన్ ద్వారా అవకాశం ఉందని తెలిపారు. చెత్త ట్రాక్టర్లు పాడైపోతే వాటిని రిపేర్ చేయించుకోవాలన్నారు. చెత్త రోజు సేకరించకపోతే గ్రామాల్లో చెత్త బయట పడేస్తారని మంత్రి హరీశ్‌రా వు కూడా నిన్న స్వయంగా చెత్త ఏరి గ్రామాన్ని పరిశుభ్రం గా ఉంచుకోవాలనిసూచించారని తెలిపారు. నాలుగవ స్థాయి సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరై మాట్లాడుతూ విద్యాశాఖ అధికారి అన్ని తన పరిధిలోని అన్ని పాఠశాలలను పర్యవేక్షించి ఏమైన సమస్యలు ఉంటే వాటిని తొందరగా పరిష్కరించేలా చర్యలు తీ సుకోవాలన్నారు.

అలాగే వైద్య శాఖ అధికారి మారుమూలలో ఉన్న ఆసుపత్రులు సందర్శించి వాటిలో డాక్టర్లు సక్రమంగా హాజరవుతున్నారా లేదా అన్ని పరకరాలు ఉన్నా యా లేదా అన్ని సౌకర్యాలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని పరీక్షించి స్టాప్ యొక్క వివరాలు తెలుసకొని వాటిని పర్యవేక్షించాలన్నారు. గవర్నమెంట్ హైస్కూల్ చాలా దూరంలో ఉండటం వలన విద్యార్థులకు గ్రంథాలయం అందుబాటులో ఉండడం లేదని గ్రందాలయాలను మున్సిపల కాంప్లెక్స్‌లోని ఫస్ట్ ప్లోర్‌కు కేటాయిస్తానని దానికి మార్చమని అందులో పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలనుఅ ందుబాటులో ఉంచి విద్యార్దులకు అందుబాటులో ఉంచేలా ప్రతిరోజు గ్రంథాలయంలో తెరిచి ఉంచేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, జడ్పిటిసిలు కొటగిరి శ్రీహరిగౌడ్, సూకురి లక్ష్మి, నాగరాజు, కొండల్ రెడ్డి, జిల్లా స్ధాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News