Monday, December 23, 2024

గ్రామ పంచాయతీలను తనఖీ చేసిన అదనపు కలెక్టర్

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : గ్రామ పంచాయితీలలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరే వారి క్రమబద్దీకరణకు సహకరిస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. మంగళవారం మ ండల పరిధిలోని చివ్వెంల, లక్ష్మీనాయక్ తండా, సేవాలాల్ తండా, పాచ్య నాయక్ తండా, పిల్లలజగ్గు తండా, అక్కలదేవి గూ డెం, బీమ్లా తండా గ్రామాలలో ఆయన పర్యటించి గ్రామ పంచాయతీలలో రికార్డులను పరిశీలించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కొరకు ఏర్పాటు చేసిన కమిటిలో భాగంగా కొన్ని గ్రామపంచాయతీలను ఆయన పరిశీలించారు. గ్రామాలలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత నాలుగు సంవత్సరాలుగా వారు చేసిన పనుల ఆధారంగానే వారికి మా ర్కులు కేటాయించడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, స్మశానవాటిక, సెక్రికేషన్ నర్సరీలు, కార్యక్రమాలు ఆధారంగానే వారికి మార్కులు కేటాయిస్తున్నామని అన్నారు.

కార్యక్రమంలో డిఎస్పీ నాగభూషణం, డిఎఫ్‌ఓ సతీష్, ఎంపిడిఓ లక్ష్మి,ఎంపిఓ గోపి, పంచాయితీ కార్యదర్శులు చలమయ్య, కోటిరెడ్డి, రజిని, గ్రీష్మ, మధు, అశోక్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News