సిటీ బ్యూరో: ఓటరు జాబితాలో నమోదైన కొత్త ఓటర్ల పరిశీలనను బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించేలా ఇఆర్‌ఓలు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ అదేశించారు. రానున్న ఎన్నికల దృష్యా ఓటరు నమో దు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఈఆర్‌ఓ లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ హైదరాబాద్ జి ల్లా పరిధి లోని 15 నియోజకవర్గాల్లో ఓటరు జాబితా ఎలాంటి తప్పులు లేకుండా ఉండాలన్నారు. ఇంటి నెంబర్‌ఆధారంగా ఓటరు లను గుర్తించి ఖచ్చితమైన పోలింగ్ స్టేషన్ల వారీగా కేటాయించాలని అదేశించారు.
ఓ టరు జాబితాలో ఉన్న తప్పిదాలను సవరించడానికి ఈఆర్‌ఓ నెట్ ద్వారా మార్పులు, చేర్పులు సక్రమంగా చేయాలన్నారు. ఓటరు జాబితలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా మొబైల్ నెంబర్, ఆధార్ అనుసంధానం చేయాలని, డుప్లికేట్ ఫోటో లను రీ-ప్లేస్ మెంట్ పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. నియోజకవర్గాల వారీగా అందిన వివిధ దరఖాస్తులకు సంబంధించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఈ ఆర్ ఓలను ఆదేశించారు. ఓటరు షిఫ్టింగ్, డెత్, చిరునామా మార్పు, ఇతర మార్పు చేర్పులు, గానీ కొత్త ఓటరు నమోదును బి.ఎల్.ఓ లు సత్వరమే ఓటరు జాబితాలో అప్ డేట్ చేయాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల పరిధిలో రోజుకు ఒక ప్రదేశం లో సంచార వాహనాల తో పాటు ఆయా నియోజక వర్గ ఈ అర్ ఓ కార్యాలయాలలో ఈ విఏం, వివి ప్యాట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యం లో ఆయా రాజకీయ పార్టీ ల ప్రతినిధుల కూడా ఓటర్ల కు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ శంకరయ్య, జాయింట్ కమిషనర్ మంగతాయారు, ఏ. ఎం.సి మారుతి, ఈ.ఆర్.ఓ లు, పార్టీల ప్రజాప్రతినిధులు కార్తిక్ రెడ్డి (బిఆర్‌ఎస్), రాజేష్ కుమార్, మహమ్మద్‌వాజిద్ హుస్సేన్ (కాంగ్రెస్), నవదీష్ కుమార్ (బిఎస్‌పి), కొల్లూరు పవన్, భరద్వాజ్ (బిజెపి), శ్రీనివాస్, శ్రీనివాసరావు(సిపిఐఎం), జోగేందర్(టిడిపి), మోహియుద్దీన్ సాహెబ్ (ఎంఐఎం) తదితరులు పాల్గొన్నారు.