- Advertisement -
కామారెడ్డి: జిల్లాలోని బీర్కూర్ మండలంలో దారుణ హత్య జరిగింది. రైతునగర్ లో కిరాణా షాపు నిర్వాహకుడు నారాయణ దంపతులను కొందరు గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మంగళవారం రాత్రి నారాయణ ఇంట్లోకి దుండగులు చొరబడి దాడి చేశారు. నారాయణను ఆయుధాలతో కొట్టి చంపిన దుండగులు ఆయన భార్యను చీరతో ఉరేసి దారుణంగా హత్య చేశారు.
స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -