Saturday, November 23, 2024

రహేజా కార్ప్ గ్రూప్ కంపెనీతో కలిసి రెయిన్‌కోట్‌లను పంపిణీ చేసిన ఇనార్బిట్ మాల్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తున్నందున, ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్‌ను నిర్వహించడానికి మరియు అన్ని అవరోధాలను ఎదుర్కొంటూ ప్రజలకు సహాయం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. వారి కృషి మరియు అంకితభావాన్ని గుర్తించి, ఇనార్బిట్ మాల్ మరియు 2005లో BITS పిలానీ విద్యార్థులు ప్రారంభించిన నమోదిత NGO అయిన Nirmaan.org జూలై 22, 2023న సైబరాబాద్ కమిషనరేట్‌లో 1200 రెయిన్‌కోట్‌లను అందజేయడానికి చేతులు కలిపాయి.

సంస్థ యొక్క CSR కార్యక్రమం ఇనార్బిట్ కేర్స్ కింద ‘స్టే ఇన్‌లేన్’ అని పిలువబడే ఈ సహకార ప్రచారం లో భాగంగా అధికారులకు 1200 ప్రకాశవంతమైన పసుపు రంగు రెయిన్‌కోట్‌లను వారి సౌలభ్యం, భద్రత మరియు సంసిద్ధతతో వారు తమ విధిని నిర్వర్తించడం, సవాలు పరిస్థితులలో పౌరులకు సౌకర్యాన్ని అందించడం కోసం పంపిణీ చేసింది.

పోలీస్ కమీషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, IPS మాట్లాడుతూ, “ఇనార్బిట్ మాల్, కె రహేజా కార్ప్ మరియు నిర్మాణ్.ఆర్గ్ అందించిన అమూల్యమైన సహకారంకు మేము మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. మా ట్రాఫిక్ పోలీసులకు రెయిన్‌కోట్‌లను అందించడంలో వారి ప్రయత్నం నిజంగా అభినందనీయం. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా, మా అధికారులు తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించటానికి తగిన మద్దతు ఇవ్వడం లో వారి నిబద్ధతను ఇది ప్రదర్శిస్తుంది. సవాలు తో కూడిన వాతావరణంలో కూడా నగరం యొక్క ట్రాఫిక్ సజావుగా సాగేలా చేయడంలో ఇటువంటి ఆలోచనాత్మకమైన చర్యలు కీలక పాత్ర పోషిస్తాయి. మా అధికారులు మరియు సమాజం యొక్క భద్రత, శ్రేయస్సు కోసం వారి భాగస్వామ్యం, అంకితభావానికి మేము కృతజ్ఞులం…” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News