Friday, November 15, 2024

కెసిఆర్ నాయకత్వంలోనే రైతే రాజు..

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:మన తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజుగా చూడాలన్నదే సిఎం కెసిఆర్ లక్షమని, ఆ దిశగా ప్రణాళిక లు రూపొందించి అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లా కోఆపరేటివ్ సెం ట్రల్ బ్యాంక్ నూతన బ్రాంచ్‌ని ఆయన ంఎల్‌ఏ చిరుమర్తి లింగయ్యతో కలిసి చిట్యాల పట్టణంలో బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడా రు. జిల్లాలోని రైతులకు ఎంతో ఉపయోగకరంగా వుండేందుకు ఈ బ్యాంకు ఉపయోగపడుతుందన్నారు.

గతంలో అన్ని సహకారం బ్యా ంకులు వున్నా నష్టాల్లో వుండేవని, కాని ఈ రోజున అన్ని బ్యా ంకులు లాభాల్లోకి వచ్చాయని అన్నారు. నల్లగొండ జిల్లా సహకారం బ్యాంకు దాని అధ్యక్షులు గొ ంగిడి మహేందర్‌రెడ్డి నాయకత్వంలో మంచి అభివృద్ధి సాధించిందన్నారు. రైతాంగం అందరూ ఈ బ్యాంకులో సభ్యత్వాలు తీసుకోవాలన్నారు. విత్తనాలు , ఎరువుల విక్రయాలతో పాటు ధాన్యం కొనుగోల్లలో సహకారర సంఘాల పాత్ర అద్బుతమని అన్నారు.

అదే సమయంలో సహకార సంఘాలు ఇత ర ఆహార ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోల్లు చేపట్టాలని సూచించారు.డిసిసిబి చైర్మన్ గొంగిడి మ హేందర్‌రెడ్డి, జడ్పి చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి , జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, డిసిసి బి వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకట్‌రెడ్డి, చిట్యాల సహకారం సంఘం చైర్మన్ సుంకరి మల్లేష్‌గౌడ్, వైస్ చైర్మన్ మెండె సైదులు, ఎంపిపి సునిత, జడ్‌పిటిసి ధనమ్మ, మార్కెట్ చైర్మన్ ఆదిమల్లయ్య, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అద్యక్షుడు తేరటిపల్లి హనుమంతు, బ్యాంకు మేనేజర్ కర్నాటి అశోక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News