- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాలు, ఇతర జూనియర్ కాలేజీల్లో మొత్తం 3,80,286 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు అధికారులు వెల్లడించారు. అందులో రాష్ట్రంలోని 408 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 72,208 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా,1,441 ప్రైవేట్ కాలేజీల్లో 2,35,458 మంది ప్రవేశాలు పొందారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి. గత విద్యాసంవత్సరం 4,98,699 మంది ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు పొందారు. ఇంటర్ ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజ్లీలో ప్రవేశాలు మరింత పెరగనున్నాయి.
- Advertisement -