Saturday, November 23, 2024

భారీ వర్షాల దృష్టా అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్:రానున్న రెండు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురవనున్న సందర్భంగా జిల్లా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి గోపి తెలిపారు. బుధవారం కరీంనగర్ కలెక్టర్ చాంబర్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వర్షాభావ పరిస్థితులపై జిల్లా కలెక్టర్‌లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు.

అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ బి గోపి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపిందని, ఎటువంటి సంటనలు ఎదురైనా సమర్దవంతంగా ఎదుర్కొవడానికి అధికారులు సిద్దంగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ఉన్న ప్రజల సాయానికి జిల్లాలో కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నెంబర్ 1800 425 4731, కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ నెంబర్ 9849906694 నెంబర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలు అత్యవసర సేవల కొరకు ప్రజలు సంప్రదించవచ్చని తెలిపారు.

రాబోయే రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మికిరణ్, టైని కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్సో, ఇరిగేషన్ ఈఈ శివకుమార్, డీపీవో వీరబుచ్చయ్య, మున్సిపల్ శాఖ ఎస్‌ఈ, డీఆర్డీవో శ్రీలత, డిస్టిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న, డీఏవో శ్రీధర్, డీఐవో అస్మత్ ఆలీ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News