Saturday, November 16, 2024

ఆగస్టు మూడో వారంలో టి టిడిపి బస్సు యాత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆగస్టు మూడవ వారంలో బస్సు యాత్ర నిర్వహించాలని, బస్సుయాత్ర నిర్వహణ కోసం 9 కమిటీలను ఏర్పాటు చేసి యాత్ర విజయవంతానికి కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. తాను చేపట్టబోయే బస్సు యాత్రపై పార్టీ ముఖ్యనాయకులతో కాసాని భేటీ అయ్యారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నర్సింహులుతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఈ సందర్భంగా అధ్యక్షులు కాసాని మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో పార్టీ చేసే కార్యక్రమాల క్యాలెండర్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అందు కోసం ఈ నెల 28,29 రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో వర్క్‌షాప్‌ను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

మొదటి రోజు 9 పార్లమెంట్ (భువనగిరి, చేవెళ్ల, హైదరాబాద్, జహీరాబాద్, మహబూబ్నగర్, మల్కాజ్ గిరి, మెదక్, సికింద్రాబాద్, నల్లగొండ), రెండవ రోజు 8 పార్లమెంట్ నియోజకవర్గ (కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, వరంగల్) నాయకులతో వర్క్ షాపు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ వర్క్ షాపులో బస్సు యాత్ర రూట్ మ్యాప్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ప్రజా సమస్యలు 6 అంశాలపై చర్చను నిర్వహించుకుందామన్నారు. వీటిపై నాయకుల అభిప్రాయాలు, సూచనలు తీసుకొని కార్యాచరణను రూపొందించనున్నట్లు కాసాని వెల్లడించారు. మరీ ముఖ్యంగా టీడీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని బస్సు యాత్రలో ప్రజలకు వివరిస్తామని, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఏమి చేయబోతున్నదో కూడా ఈ యాత్రలో వివరించి ప్రజల ఆశీర్వాదం కొరతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, కేంద్ర అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, టి.జ్యోత్స్న, కేంద్ర పార్టీ కార్యదర్శి కాసాని విరేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాట్రగడ్డ ప్రసూన, నందమూరి సుహాసినీ, ఆలీ మస్కతి, సామ భూపాల్ రెడ్డి, బండి పుల్లయ్య, పి. చంద్రయ్య, ప్రధాన కార్యదర్శులు జక్కలి ఐలయ్య యాదవ్, ఎకె గంగాధర్ రావు, అజ్మీర రాజు నాయక్, బండారు వెంకటేష్, గడ్డి పద్మావతి, కూరపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News