Saturday, November 16, 2024

సమస్య పట్టించుకోలేదని వార్డ్ ఆఫీసులో పాముతో నిరసన

- Advertisement -
- Advertisement -

అల్వాల్ ః అసలే ఎడతెరిపిలేని వర్షాలు .. మరోవైపు వరద ముంపు..వీటితోనే అష్ట కష్టాలు పడుతుంటే అదనంగా పాముల బెడత మొదలైంది.. ఈ సమస్యలను పరిష్కరించాలంటూ జిహెచ్‌ఎంసి అధికారులకు ఎంత మొర పెట్టుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో చిరేత్కువచ్చిన ఓ నగరవాసి సమస్యనే జిహెచ్‌ఎంసి వార్డు ఆఫీస్‌కు తీసుకువెళ్లి నిరసన తెలిపారు. దీంతో అధికారులు ఒక్కసారిగా అవాక్కు అవ్వడమే కాకుండా అప్రమత్తమైయ్యారు. నగరంలో గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పూర్తిగా జలదిగ్భంధనం అవుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఈ భారీ వర్షాలకు అల్వాల్ ప్రాంతంలో వరదతో పాటు మురుగు నీరు ఇళ్లలోకి వస్తోంది.

అయితే బాధితుడి ఇంటిపక్కన మరో ఓఇళ్లు చాల రోజులుగా ఖాళీగా ఉండడంతో ఆ ఇంట్లో పిచ్చిమొక్కలు పెరిగి పాములకు ఆవాసంగా మారింది. ఇదే క్రమంలో వరద నీరు చేరడంతో బయటికి వచ్చినా పాము పక్కింటిలోకి రావడంతో భయాభ్రంతులకు గురైన ఇంటి వారు జిహెచ్‌ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే 6 గంటలుగడిచినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తో ఓపిక నశించిన అక్షయ్ కుమార్ అనే యువకుడు ఇంట్లోకి వచ్చిన పామును అష్ట కష్టాలు పడి పట్టుకుని నేరుగా అల్వాల్ జిహెచ్‌ఎంసివార్డు ఆఫీసుకు పామును వెళ్లాడు. వెంట తెచ్చిన పామును టేబుల్ పై పెట్టి నిరసన తెలిపాడు. ఈ పాము ఇంట్లోకి రావడం వల్ల తాము పడ్ట కష్టంతో పాటు తమ భయాన్ని అధికారులకు తెలియజేసేందుకు పాముతో నిరసన వ్యక్తంచేస్తున్నట్లు తెలిపారు.
స్పందించిన జిహెచ్‌ఎంసి ః
ఈ ఘటనకు సంబంధించి జిహెచ్‌ఎంసి తక్షణమే స్పందించింది.హుటాహుటిన సంఘటన స్థలానికి సహాయ బృందాలను పంపించారు. పాములు రావడానికి కారణమవుతున్న బాధితుడి ఇంటి పక్కన శిధిలావస్థఇంటిని పూర్తిగా కూల్చివేశారు. వరద నీరు రాకుండా చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News