Sunday, November 17, 2024

యాదాద్రిలో స్వాతి నక్షత్ర పూజలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:యాదాద్రి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్ర పూజలను వైభవంగా నిర్వహి ంచారు. బుధవారం స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలను చేపట్టారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీ స్వామి, అమ్మవార్లను ప్రత్యేక అలంకరణ గావించి స్వాతినక్షత్ర పూ జలను గావించారు.

స్వామివారికి ప్రత్యేక పూజ అయిన శతఘటాభిషేక పూజను ఆలయ ముఖమండపంలో ఘనంగా నిర్వహించారు. స్వాతి నక్షత్ర పర్వదినం పురస్కరించుకొని భక్తులు, స్థానికులు తెల్లవారుజాము నుంచే యాదాద్రి కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేసి భక్తిశ్రద్ధలతో శ్రీలక్ష్మీనరసింహస్వామి నామస్మరణ చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో జరిగిన నిత్యపూజలలో పా ల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. కొండపైన గల శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. కొండకింద గల శ్రీపాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా స్వాతినక్షత్ర పూజలను నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.

స్వామివారి నిత్యరాబడి..
శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్యరాబడి రూ.8,89,708 నిత్యరాబడి సమకూరినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్ర యం, వీఐపీ దర్శనం, ప్రధాన బుకింగ్, ఆర్జిత సేవలు, పాతగుట్ట తదితర శాఖల నుంచి ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

స్వామివారికి వెండి కలశాల బహుకరణ..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి వెండి కలశాల బుధవారం భక్తులు అందించారు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన గౌళీకార్ శ్యామ్‌లాల్ కుటుంబ సభ్యులు ఆరు వెండి కలశాలను బహుకరించారు. బెంగళూరుకు చెందిన ఎన్వీప్రసాద్, ఏఎన్ రావు కుటుంబ సభ్యులు స్వామివారికి ఆరు వెండి కలశాలను అందజేశారు.

స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మేఘాలయ డీఐజీ సుబ్బారావు, ములుగు ఎస్పీ గౌష్ ఆలం స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News