Monday, December 23, 2024

ఆయిల్ పామ్ సాగు లక్షాలను పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్షాలను త్వరితగిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

ఆయిల్ పామ్ సాగు ఎంతో లాభదాయకమని, రైతులు ప్రత్యామ్నయ పంట క్రింద దీనిని సాగు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి 15 రోజులకోమారు ఆయిల్ పామ్ సాగుపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే సమావేశానికి ప్రతి క్లస్టర్‌లో 10 ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ ఫ్లాంటేషన్ పూర్తి చేయాలని లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ సాగులో మొదటి మూడు సంవత్సరాలు అంతర సాగుతో ఆదాయం పొందవచ్చని, తర్వాత సంవత్సరం నుంచి లక్ష వరకు ఎకరానికి ఆదాయం సమకూరుతుందని కలెక్టర్ తెలిపారు.

వ్యవసాయ అధికారులు ప్రభుత్వం సబ్సిడీపై అందించే డ్రిప్ సిస్టం, ఎకరానికి రూ.4200 ఇస్తున్న ప్రోత్సాహాకాలను రైతులకు తెలుపాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి అనుకున్న లక్షాలను నెరవేర్చాలన్నారు. అలాగే జిల్లాలోని 54 రైతు వేదికలల్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు తదితర మౌళిక వసతుల కల్పన కల్పించాలన్నారు. రైతు వేదికల్లో మంచి లాభాలు అర్జించిన రైతుల వివరాలు, వారి ఫోటోలను పెట్టాలన్నారు. ప్రతి రోజు కొంత సమయం రైతుల కోసం వ్యవసాయ విస్తరణ అధికారులు కేటాయించాలని ఆయన తెలిపారు.

ప్రతి శుక్రవారం తప్పనిసరిగా రైతు వేదికలో ఆధునిక సాగు పద్దతులు, వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశాలకు మండల వ్యవసాయ అధికారులు, ప్రత్యేక అధికారులు, వ్యవసాయ శాఖ ఏడీలు పాల్గొనాలని ఆదేశించారు. రైతు వేదికల్లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేదించాలని, బ్లాక్ బోర్డు ఏర్పాటు చేసి కలర్ చాకులతో వివరాలు ప్రదర్శించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా శాఖ అధికారులు జగన్ మోహన్ రెడ్డి, ఆదిరెడ్డి, జ్యోతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News