Monday, December 23, 2024

దేశం కోసం అవసరమైతే నియంత్రణ రేఖ దాటడానికి సిద్ధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశం కోసం అవసరమైతే మరోసారి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజలు కూడా సైన్యానికి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు. ద్రాస్ లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. బుధవారం దేశ వ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తున్నారు.

“ మనకు పాకిస్థాన్ వెన్నుపోటు పొడిచింది. భారత్ యుద్ధం చేయాల్సి వచ్చింది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులకు వందనం చేస్తున్నా. దేశం యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొన్న ప్రతిసారీ ప్రజలు పరోక్షంగా మద్దతుగా నిలిచారు. యుద్ధ రంగంలో అవసరమైన చోట సైనికులకు నేరుగా మద్దతు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. ” అని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News