హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ శాఖ క్లైమేట్ విశ్లేషణ చేయడంతో పాటు, వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ విశ్లేషణ (ఈ రోజు ఉదయం 08:30 ఆధారంగా): నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు అల్పపీడనంగా బలహీన పడి ప్రస్తుతం దక్షిణ ఒడిస్సా & పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద కొనసాగుతుంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి మి ఎత్తు వరకు కొనసాగుతుంది.రుతుపవన ద్రోణి ఈ రోజు బికానర్ , కోట, రైజన్, దుర్గ్, దక్షిణ ఒడిస్సా & పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని అల్పపీడన ప్రాంతము మీదగా తూర్పు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.ఈ రోజు షీయర్ జోన్ 18°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ నుండి 7.6 కిమి ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast):ఈ రోజు, రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అనేక చోట్ల ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (Weather Warnings): ఈ రోజు భారీ వర్షములు కొన్ని చోట్ల, భారీ నుండి అతిభారీ వర్షములుతో పాటు అత్యంత భారీ వర్షములు తెలంగాణలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి.రేపు భారీ వర్షములు తెలంగాణలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
2 రోజులు RED అలెర్ట్
రాగల 2 రోజులు తెలంగాణలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుండి 50కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.