Sunday, November 17, 2024

ప్రధాని మోడీపై మల్లికార్జున ఖర్గే ధ్వజం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో ర్యాలీలకు హాజరైన ప్రధాని మోడీకి అరగంట సమయం సభకు హాజరై ప్రకటన చేసేందుకు తీరిక లేదా ? అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ధ్వజమెత్తారు. మణిపూర్ వ్యవహారంపై తక్షణమే చర్చ చేపట్టాలని గురువారం ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే ప్రధాని తీరును దుయ్యబట్టారు. సభ నడుస్తుండగా ఆయన రాజస్థాన్‌లో రాజకీయ ప్రసంగాలు, ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని ఖర్గే మండిపడ్డారు.

ప్రధాని మోడీకి మణిపూర్ అంశంపై మాట్లాడేందుకు ఆసక్తి లేదని, ఆయనకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని వెల్లడవుతోందని విమర్శించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కాపాడాలని ఆయన కోరుకోవడం లేదని, పార్లమెంట్‌ను ఆయన అవమానిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. అంతకు ముందు గురువారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో కొందరు ఎంపీలు నల్లదుస్తులు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజ్యసభకు చెందిన విపక్ష ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ సభకు వచ్చి మణిపూర్‌పై ప్రకటన చేయాలని నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News