Monday, December 23, 2024

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:గుర్తు తెలియన వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నూతనకల్ మండల పరిధిలోని పెదనెమిల గ్రామ శివారులో 365 జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదనెమిల గ్రామానికి చెందిన రాచకొండ విప్లవ్ (35) మరిపెడ బంగ్లా నుండి తన బైక్ పై స్వగ్రామానికి వస్తున్నాడు.

గ్రామ శివారులో గుర్తు తెలియన వాహనం వెనుక నుండి ఢి కొట్టడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు 100 కు సమాచారం ఇవ్వడంతో అక్కడి చేరుకున్న పోలీసులు అతడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ద్వారా కుటు ంబ సభ్యులకు సమాచారం అందించారు. మృ తుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News