- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి నిజాంసాగర్ ప్రాజెక్టు కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు లో కొనసాగుతున్న ఇన్ ఫ్లో 30 వేల క్యూసెక్ లు కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 17 టిఎంసి లు. ప్రస్తుత నీటి మట్టం 15 టీఎంసీ లకు చేరింది. దీంతో అధికారులు నిజాంసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేశారు.
- Advertisement -