Monday, December 23, 2024

విండీస్ 114 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

కెన్సింగ్‌టన్ ఓవల్: భారత్-వెస్టిండీస్ మధ్యజరుగుతున్న తొలి వన్డేలో విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులు చేసి ఆలౌటైంది. షాయ్ హోప్ ఒక్కరే 43 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. టీమిండియా బౌలర్ల ధాటికి విండీస్ విలవిలలాడింది.  విండీస్ బ్యాట్స్‌మెన్లను తమ స్పిన్ మాయజాలంతో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా గజ గజ వణికించారు. విండీస్ బ్యాట్స్‌మెన్లలో అలిక్ అతనాజే(22), బ్రాండన్ కింగ్ (17), షిమ్రాన్ హెట్‌మేయర్(11) పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. షెపార్డ్, జయడెన్ షీల్స్ జీరో పరుగులు చేసి డకౌట్ రూపంలో ఔటయ్యారు. టీమిండియాలో బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు, హార్ధిక్ పాండ్యా, ముకేష్ కుమార్, షార్థూల్ టాకూర్ తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News