Monday, January 20, 2025

మంటల్లోనే “కార్ల నౌక”…. మృతుడు భారతీయుడే

- Advertisement -
- Advertisement -

ది హేగ్ : జర్మనీ నుంచి సింగపూర్‌కు 2857 కార్లతో బయల్దేరిన ఓ రవాణా నౌక బుధవారం నెదర్లాండ్స్ తీరంలో మంటల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి భారతీయుడిగా గుర్తించారు. నెదర్లాండ్స్ లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే అతడి వివరాలు తెలియరాలేదు. మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి సాయం చేస్తున్నాం. గాయపడిన సిబ్బందితో కూడా టచ్‌లో ఉన్నాం. వారంతా క్షేమంగా ఉన్నారు. నెదర్లాండ్స్ అధికారులు , షిప్పింగ్ కంపెనీ సమన్వయంతో అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని భారత ఎంబసీ పేర్కొంది. గాయపడిన వారిలో భారతీయులు ఉన్నారా ? అని తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News