Saturday, December 21, 2024

గడగడలాడించిన కడెం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: భారీ వర్షాల తో గోదావరి నదీ పరివాహకంగా వాగులు వంకలు ఏకమై పారుతున్నాయి. గోదావరిలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూ వ స్తోంది. కడెం వాగు మహోగ్రరూపం దాల్చిం ది. కడెం ప్రాజెక్టు వద్ద వరదనీరు గేట్లు ఎక్కి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద నియంత్రణ చేయిదాటి పోయిందని చెబుతున్నారు. రెండు గేట్లు మోరాయిస్తున్నాయని తె లిపారు. జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పకప్పుడు సమీక్షిస్తున్నారు. స్వర్ణప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. ఎగవ నుంచి గోదావరి నదిలో వరద ఉధృతి అంతకంతకూ
పెరుగుతుండటంతో భద్రాచలం పట్టణం వరదభయం గుప్పిట్లో బిక్కిబిక్కుమంటోంది.

నదిలో నీటిమట్టం 48.70అడుగులకు చేరింది. వరద ఉధృతిని గమనిస్తూ మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసేందుకు సిద్దమవుతున్నారు. నదిలో 11.77లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తోంది. భద్రాచలం పట్టణంలోకి వరదనీరు ప్రేవేశించే అవకాశాలు గమనించిన అధికారులు ఎప్పటికప్పుడు వరదనీటిని తోడిపోసేందుకు రెండు భారీ మోటార్లను ఏర్పాటు చేశారు.మరోవైపు రెండు హెలికాప్టర్లను కూడా అందుబాటులో ఉంచారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాలమేరకు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఖమ్మంలో మున్నేరు వాగు వరద ఉధృతిలో చిక్కుకున్న ఏడుగురిని కాపాడేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. ప్రత్యేక డ్రోన్‌ను పంపి ఇంట్లో చిక్కుకున్న వారి పరిస్థితిని ఆరా తీస్తున్నారు.ఆరు గంటలకు పైగా శ్రమించి ఎట్టకేలకు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు.
వంద చెరువులకు గండ్లు
రాష్ట్రంలో భారీ వర్షాలవల్ల వంద చెరువులకు గండ్లు పడ్డాయి.ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరుగుతోందని నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ వెల్లడించారు.రాష్ట్రంలోని 19టెరిటోరియల్ ప్రాంతాల్లో చీఫ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఆపరేషన్ బృందాలు పనిచేస్తున్నాయి. గోదావరికి వరద ఉధృతి పెరిగినందున పోలవరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఉంచాలని ఏపి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ఈ వర్షాల వల్ల 46వేల చెరువులు జలకళను సంతరించుకున్నాయి.

నిండిన శ్రీరాంసాగర్..26 గేట్లు ఎత్తివేత
ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీరాంసాగర్ ప్రాజెకులో ్ట నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది. ఎగువ నుంచి 2.42లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా , ప్రాజెక్టు 26గేట్లు ఎత్తివేశారు. దిగువకు 1.54లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటినిలువ 90టిఎంసీలు కాగా 77టిఎంసీల నీటిని నిలువ ఉంచారు. కడెం ప్రాజెక్టులోకి 1.52క్యూసెక్కుల నీరు చేరుతుండగా,16గేట్లు ఎత్తివేసి 2.40లక్షలక్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 6.06లక్షల క్యూసెక్కుల వరద చేరుతుండగా ,దిగువకు 6.24లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

మేడిగడ్డ వద్ద లక్ష్మిబ్యారేజిలోకి 7.08లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా,81గేట్ల ద్వారా అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం వద్ద గోదావరిలో 11.65లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 36వేలక్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీరు గరిష్టస్థాయికి చేరటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి కూడా లక్ష క్యూసెక్కుల నీరు చేరుతోంది.ప్రాజెక్టు 16గేట్లు ఎత్తివేసి 56వేలక్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

గరిష్టస్థాయికి చేరువలో అల్మట్టి ..గేట్లు ఎత్తివేత
కృష్ణానదీ పరివాహకంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువవుతోంది. ముందుజాగ్రత్త కింద ప్రాజెక్టుగేట్లు తెరిచారు. ఎగువ నుంచి 1.65లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 1.75లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 129టిఎంసీల పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధానికి గాను 93టిఎంల మేరకు నీరు చేరింది. జూరాల ప్రాజెక్టులోకి 34వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, దిగువకు 27వేలక్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3993క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం 817అడుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News