Friday, November 22, 2024

విద్యుత్ రంగాన్ని ప్రవేట్ పరం చేయవద్దు

- Advertisement -
- Advertisement -

కేంద్ర ఎనర్జీ సెక్రటరి విజ్ఙప్తి చేసిన ఎఐపిఈఎఫ్ ప్రతినిధులు

మన తెలంగాణ / హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని గృహ వినియోగదారులకు మరియు పారిశ్రామిక వినియోగదారులకు సేవలు అందించాలంటే విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయొద్దని ఆల్ ఇండియా పవర్ ఫెడరేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన నేచురల్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజనీర్స్(ఎన్‌సిసిఒఈఈఈ) సమావేశంలో దేశంలోని విద్యుత్ రంగానికి సంబంధించిన ట్రేడ్‌యూనియన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.కేంద్ర ప్రభుత్వం ఒక వేళ విద్యుత్ సవరణ బిల్లు ప్రవేశపెడితే మెరుపు సమ్మెకు వెనకాడబోమని వారు హచ్చరించారు. అనంతరం వారు కేంద్రం ఎనర్జీ సెక్రటరి పంకజ్ అగర్వాల్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయవద్దని చేస్తే వచ్చే ఆర్థిక మరియు ప్రజలకు సేవ చేయడం చాలా ఇబ్బందులు ఉంటాయని వారు వివరించారు.అందుకు ఎనర్జీ సెక్రటరీ స్పందిస్తూ విద్యుత్ అమెండ్‌మెంట్ బిల్లు ద్వారా జరిగే నష్టాన్ని గుర్తించి తగు చర్యలను తీసుకుంటామని హమీ ఇచ్చారు. మీరంతా రానున్న కాలంలో వచ్చే విద్యుత్‌డిమాండ్‌కు తగినట్లుగా పనిచేయాలని, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పవర్ ఫెడరేషన్ చైర్మన్ శైలేంద్ర దుబే, సెక్రటరీ జనరల్, పి. రత్నాకర్ రావు ,టిఎస్‌పిఇఏ కార్యదర్శి సదానందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News