Friday, December 20, 2024

ప్రియురాలిని చితకబాది… అర్ధనగ్నంగా చెట్టుకు కట్టేశారు…

- Advertisement -
- Advertisement -

రాంఛీ: ప్రియుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రియురాలిని చితక బాది అర్ధనగ్నంగా చెట్టుకు కట్టేసిన సంఘటన ఝార్ఖండ్ జిల్లా గిరిడీహ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ప్రియురాలికి ఇంటికి రావాలని ప్రియుడు కబురు పంపడంతో ఆమె వచ్చింది. వెంటనే అతడు తండ్రి, తల్లి, సవతి తల్లి, ప్రియుడు కలిసి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై దాడి చేసి దుస్తులు చించేసి అర్ధనగ్నంగా చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ప్రియురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమెపై దాడి చేసిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఆమె మరుసటి రోజు వరకు ప్రాణాలు కోల్పోతుందని నిందితులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు గ్రామస్థులకు తెలిపారు.

Also Read: రూ. 1.5 కోట్ల ల్యాండ్ రోవర్‌లో బాబా రాందేవ్ షికార్లు(వైరల్ వీడియో)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News