Saturday, December 21, 2024

జైలు నుంచి విడుదలై…ఆరుగురికి కత్తిపోట్లు

- Advertisement -
- Advertisement -

ప్రయాగ్‌రాజ్: ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లా పడిల గ్రామానికి చెందిన రాజాబాబు అనే హిస్టరీ షీటర్ జైలు నుంచి విడుదలైన 10 రోజులకే అరడజను మందిని కత్తితో పొడిచి బీభత్సం సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. కత్తిపోట్లకు గురైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు.

పడిల గ్రామానికి చెందిన రాజాబాబుపై తర్వాయి పోలీసు స్టేషన్‌లో అనేక కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 10 రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైన రాజాబాబు గ్రామంలో విచక్షణారహితంగా అరడజను మందిని కత్తితో పొడిచాడని వారు తెలిపారు. స్థానికులు నిందితుడిపై మూకుమ్మడిగా దాడి చేసి చితకబాది పోలీసులకు అప్పగించారని వారు చెప్పారు. గాయపడిన రాజాబాబు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వారు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రాజాబాబుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కొద్ది నెలల క్రితం పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో రాజాబాబుకు బుల్లెట్ గాయమైంది. అతడికి చికిత్స అందచేసిన అనంతరం జైలుకు పంపించారు. 10 రోజుల క్రితమే విడుదలయ్యాడు. గురువారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన లాల్జీ భర్తీయ అనే వ్యక్తి పనులు చేసుకుని ఇంటికి తిరిగివస్తుండగా అతడితో రాజాబాబు గొడవపడ్డాడు. అతడిని కొట్టాడు. దీంతో ఇంటికి వెళ్లిన లాల్జీ తన పిల్లలకు ఈ విషయం చెప్పాడు.

లాల్జీ సోదరుడు సురేష్ వెంటనే రాజాబాబు ఇంటికి వెళ్లడంతో గొడవ మరింత ముదిరింది. ఇంట్లో నుంచి కత్తి తీసుకుని బయటకు వచ్చిన రాజాబాబు లాల్జీని, సురేష్‌ను పొడిచాడు. వారి అరుపులు విని పరుగెత్తుకుని వచ్చిన గ్రామస్తులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారికీ కత్తిపోట్లు పడ్డాయి. గ్రామస్తులంతా మూకుమ్మడిగా రాజాబాబును పట్టుకుని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News