సదాశివనగర్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్)ద్వారా ఓపెన్ ఎస్‌ఎస్‌స్సీ, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ కే మురళి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అగస్టు 10 వ వరకు చివరి ఉందని, సెప్పెంబర్ పది వరకు అపరాధ రుసుం చెల్లించి అడ్మీషన్ పొందవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 9642688577, 9959929739 లకు సంప్రదించాలని సూచించారు.
అడ్మీషన్ పొందాలనుకునే వారు ఏ తరగతిదైనా ఒరిజినల్ టిసీ, పుట్టిన తేది పత్రాలు రెండు జిరాక్స్ జతలతో పాటు కులదృవీకరణ, ఆధార్ కార్డు రెండు జతల జిరాక్స్‌లు, రెండు ఫోటోలు తీసుకుని ధర్మారావుపేట్ జడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో అడ్మీషన్ పొందాలని కోరారు. ఓపెన్ ఇంటర్ లో చేరే వారు ఎస్‌ఎస్‌స్సీ మెమో, కుల దృవీకరణ, ఆధార్ రెండు జతల జిరాక్స్‌ల తోపాటు రెండు ఫోటోలు ఇవ్వాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.