Monday, December 23, 2024

విద్యార్థి సంఘాలపై విద్యాశాఖ ఆంక్షలు సరికాదు

- Advertisement -
- Advertisement -

సమస్యలపై ఉద్యమిస్తుంటే అడ్డుకోవడం మానుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో, కెజీబివిలో,మోడల్ స్కూల్స్‌లోకి డిఇఓ అనుమతి లేకుండా లోపలికి రావడానికి అనుమతి లేదని విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ.రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఈసంఘం అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి ఒక ప్రకటనలో పేర్కొంటూ రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటీకీ దుస్తులు ఇవ్వలేదని, ఆశ్రమ పాఠశాలలో్, కెజిబివిలు పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం భోజనం నిధుల కొరత టీచర్ పోస్టులు భర్తీ వంటి సమస్యలు గురించి తెలుసుకుని పోరాడే నాయకులపై ఆంక్షలు పెట్టడం సమంజసం కాదన్నారు.

కెజిబివిలను కళాశాలకు ఆఫ్ గ్రేడ్ చేసి కనీసం భవనాలు లేకుండా పాఠశాలలోనే తరగతులు, డార్మెటరి నిర్వహిస్తున్న ఈ దేవసేవ ఎక్కడ పర్యటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోడల్ పాఠశాలలో కనీసం టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్నారని పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో మోడల్ పాఠశాలలో ఉండాల్సిన టీచర్లు సంఖ్య కంటే చాలా తక్కువగా ఉన్నారన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్బందాలు పెట్టి పోరాడే వారిని మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 24 వేల టీచర్ పోస్టులు భర్తీ , 30 లక్షల మందికి మధ్యాహ్న భోజనం నిధులు, కెజిబివిలలో సరైన సదుపాయాలు కల్పన లేకపోవడం బాధకరమన్నారు. మన ఊరు-మన బస్తీ-మన బడి పేరుతో వచ్చిన నిధులు గుత్తేదారులు యధేచ్చగా బిల్లులు పెట్టి దోచుకుంటుటే అధికారులు చోద్యం చూశారు తప్ప కనీసం విచారణ లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇలానే నోటిసులు ఇచ్చి, సర్య్కూలర్స్ జారీ చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించేవారమా అని రాష్ట్రం వచ్చిన తర్వాత అప్రజాస్వామిక చర్యలు ఎందుకు అని తక్షణమే ఈ చర్యలు విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News