Friday, December 20, 2024

బైక్‌ల దొంగల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  జల్సాలకు అలవాటు పడి బైక్‌లను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను సౌత్‌ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్, హుస్సేనీఆలంకు చెందిన షేక్ ముస్తఫా బ్యాండ్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు, ఓల్డ్ సంతోష్ నగర్‌కు చెందిన మహ్మద్ అఫ్సర్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఇద్దరు నిందితులు పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో జల్సాలు చేసేందుకు డబ్బలు లేవు. సులభంగా డబ్బులు సంపాధించి జల్సాలు చేయాలని ప్లాన్ వేశారు. దీనికిగాను నగరంలోని వివిధ ప్రాంతాల్లోని బైక్‌లను కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. వచ్చిన డబ్బులతో ఇద్దరు కలిసి జల్సాలు చేస్తున్నారు. నిందితులు హుస్సేనీఆలం, కాలాపత్తర్, ఖైరతాబాద్, ఐఎస్ సదన్, బండ్లగూడ, ఫలక్‌నూమా పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ రమేష్ నాయక్, ఎస్సైలు సాయిరాం, అనంతచారి, రాఘవేంద్రరెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News