పెద్దపల్లి: గత కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు ప్రాజెక్టులు, డ్యాములు, చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయని రామగుండం కమిషనర్ రెమా రాజేశ్వరి తెలిపారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో నీటి ప్రవాహాలు ఎక్కువగా ఉంటుందని, సందర్శకులు జలపాతాల వద్దకు వెళ్ల వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలు, యువత పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అవసరమైన సమయంలో 100కి ఫోన్ చేయాలని, వర్షం తగ్గుముఖం పట్టినా ప్రాజెక్టుల్లో నీటి ఉదృతి అధికంగా ఉందన్నారు.
పోలీసుల హెచ్చరికలు, సూచనలను పట్టించుకోకుండా వాహనాలతో వరద నీటిని దాటడానికి ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించిందని ఎవరు కూడా జలపాతాలు, ప్రాజెక్టులు, పర్యాటక ప్రాంతాల సందర్శనకు రావద్దని తెలిపారు.