- Advertisement -
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఒసి) జూన్ ముగింపు మొదటి త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం రూ.13,750 కోట్లతో 36.7 శాతం పెరిగింది. క్యూ4(జనవరిమార్చి) త్రైమాసికంలో లాభం రూ.10,058 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో అత్యధిక క్రూడాయిల్ ధరల కారణంగా కంపెనీ రూ.883 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అయితే ఇప్పుడు ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గడం వల్ల ఆయిల్ కంపెనీలు లాభపడుతున్నాయి. ఇండియన్ ఆయిల్ ఆదాయం మాత్రం రూ.2.25 లక్షల కోట్లతో 12 శాతం క్షీణించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.2.55 లక్షల కోట్లుగా ఉంది.
- Advertisement -