- Advertisement -
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఈ ఏడాది మే నెలలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై మూకలు అఘాయిత్యానికి పాల్పడిన కేసు దర్యాప్తును చేపట్టిన సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.
మే 4న మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై మూకలు అఘాయిత్యానికి పాల్పడిన అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దేశ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ వీడియోకు సంబంధించిన దర్యాప్తును కేంద్ర హోం మంత్రిత్వశాఖ సిబిఐకి అప్పగించింది.
ఈ ఘటనకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులపై మణిపూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సిబిఐకి బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -