Monday, December 23, 2024

వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

- Advertisement -
- Advertisement -

మణిపూర్ మరణహోమాలపై ప్రధాని మోడీ నోరు విప్పాలి
గజ్వేల్ తరహాలోనే ఇంటింటికి బంధు ప్రకటించాలి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలకు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కాగజ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ములుగు, ఏటూరు నాగారం,వరంగల్ ప్రాంతాల్లో వరదలతో సర్వం కోల్పోయిన కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి,ఇండ్లు నిర్మించాలని కోరారు. గత ఏడాది గోదావరి కరకట్టలకు రూ.1,000 కోట్ల కేటాయిస్తారని హామీ ఇచ్చిన సిఎం కేసీఆర్ వాటిని విడుదల చేయాలని పేర్కొన్నారు. గజ్వేల్ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి బంధు ప్రకటించాలని భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు రాజకీయ నాయకులు,మీడియాను అనుమతించవద్దని ప్రభుత్వం సర్క్యులర్ ఇవ్వడం వెనక్కి తీసుకోవాలని సూచించారు.

మణిపూర్‌లో జరిగిన మరణహోమాలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఉండడం దేనికి సాంకేతమన్నారు.బీజేపీ పాలనలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులో ఆదివాసులు, ఎస్సీ,మైనారిటీలపై దాడులు జరుగుతాయని, వచ్చే ఎన్నికల్లో ఫాసిస్ట్ బిజేపీని ఓడించి,దేశం నుండి బయటకు పంపించాలన్నారు. బెజ్జూరు ఒర్రె బ్రిడ్జి నిర్మించి అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడంతో గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని దిందా వాగుపై వంతెన నిర్మించకపోవడంతో పాఠశాలకు వెళ్లలేదని టీచర్లు చెబితే ఎమ్మెల్యే ఒత్తిడితో కలెక్టర్ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే కోనప్ప అండతో బెజ్జూర్ ఇంచార్జ్జీ సర్పంచ్ గ్రామ పంచాయతీలో రూ. 6 లక్షలఅభివృద్ధి పనులు చేసి, రూ.12 లక్షల నిధులు డ్రా చేశారన్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ ఇన్‌చార్జీ సర్పంచ్, అవినీతి,అక్రమాలకు సహకరించిన పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోనప్ప అక్రమాలు, అవినీతిపై త్వరలోనే విజిలెన్స్ అండ్ ఎన్‌పోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా సానికేతరులకు అధిక వేతనాలు చెల్లించి ఉద్యోగాలు కల్పిస్తున్నారని విమర్శించారు. జెకె పేపర్ మిల్ యాజమాన్యం అక్రమాలపై త్వరలోనే కార్మికులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామన్నారు. బిఎస్పీ గెలిచిన వెంటనే ప్రెస్ క్లబ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వరదల్లో చిక్కుకొన్న వారికి పార్టీ శ్రేణులు సహాయక చర్యలో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్,రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్, గణేష్,మనోహర్,విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News