Monday, December 23, 2024

మహిళా పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దాలి

- Advertisement -
- Advertisement -

వీ హబ్ బృందంతో ఓయూ అధికారుల సమావేశం

హైదరాబాద్ : ఉస్మానియా విద్యార్థులను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు అవసరమైన మౌళిక వసతులు సమకూర్చేందుకు ఓయూ అధికారులు వీ హబ్ బృందంతో చర్చలు జరిపారు. ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ నేతృత్వంలోని అధ్యాపకుల బృందం వీ హబ్ సీఈఓ దీప్తిరావు బృందంతో సుదీర్ఘంగా చర్చించింది.

వీ హబ్ ఎదుగుదల, వ్యాప్తి, ఆవిష్కరణలు, అంకురాల ఏర్పాటుకు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఓయూలోని సీఎఫ్‌ఆర్డీ లో మరిన్ని అంకురాల ఏర్పాటు కోసం ఉన్న అకాశాలపై సమావేశంలో చర్చ జరిగింది. మరిన్ని సమావేశాల తర్వాత వీహబ్ తో కలిసి ఓయూలో అంకురాల వ్యాప్తి, విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా పరిశోధన, పరిశ్రమలను సృష్టించే విషయమై స్పష్టత రానుంది.

మహిళా సాధికారత దిశగా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు చేసిన కృషిన ఈ సందర్భంగా వీ హబ్ సీఈఓ దీప్తీరావు ఓయూ బృందానికి వెల్లడించింది. 65 శాతం మహిళలు, విద్యార్థినిలే ఓయూలో విద్యార్థులుగా ఉన్నందున వారి సాధికారత దిశగా వీహబ్ నిర్వాహకులతో ఓయూ బృందం చర్చ జరిగింది. వీ హబ్ చేపడుతున్న కార్యక్రమాల పట్ల ఓయూ వీసీ ప్రొఫెసర్ డి. రవిందర్ హర్షం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా భవిష్యత్తులో వీహబ్ తో మరిన్ని చర్చలు జరుగుతాయని తెలిపారు. వీహబ్ తో జరిగిన చర్చలో ఓయూ నుంచి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, ఓఎస్డీ బి. రెడ్యానాయక్, నవీన్ కుమార్, డి. శ్రీరాములు, ఎ. ప్యాట్రిక్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News