Saturday, November 23, 2024

ఎన్నికలు చూస్తుంటే సంతోషించాలో, ఏడవాలో తెలియడంలేదు: తమ్మారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు 710 ఓట్లు పోలింగ్ అయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 4 నుంచి కౌలింగ్ ప్రక్రియ మొదలు కానుండగా సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెలువడుతాయి. ఈ ఎన్నికలలో దిల్‌రాజు ప్యానెల్, సి. కల్యాణ్ ప్యానెల్ పోటీలోకి దిగాయి.
చాలా ఎన్నికలు చూశానని, ప్రెసిడెంట్‌గానూ గెలిచానని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఇవాళ ఎన్నికలు చూస్తుంటే సంతోషించాలో, ఏడవాలో తెలియడంలేదన్నారు. ఫిలిం ఛాంబర్ ఎదిగిందని సంతోషపడాలా? లేక జనరల్ ఎలెక్షన్స్ లా ఉందనిసిగ్గుపడాలో తెలియడంలేదన్నారు. దేనికి పోటీ పడుతున్నారో… ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియడంలేదన్నారు. ఛాంబర్ అనేది అన్ని సెక్టార్స్‌కు మంచి చేయాలని, ఇలాంటివి భవిష్యత్‌లో జరగకూడదని కోరుకుంటున్నానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News