- Advertisement -
హైదరాబాద్: ఇంటికి ఆలస్యంగా వస్తున్నావని అడిగినందుకు తండ్రిని కూతురు చంపిన సంఘటన హైదరాబాద్ లోని అంబర్ పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉద్యోగం చేసి రోజు ఇంటికి రాత్రి సమయంలో ఆలస్యంగా వస్తున్నావని శనివారం రాత్రి 12 గంటలకు రావడంతో కూతురు నిఖితను తండ్రి జగదీష్ మందలించాడు. దీంతో కోపానికి గురైన కూతురు పగిలిన అద్దం ముక్కతో తండ్రి గొంతులో గుచ్చడంతో ఆయన అక్కడే తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలాడు. సమాచారం అందుకున్న అంబర్ పేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జగదీష్ ను చికిత్స నిమిత్తము ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందారు. పోలీసులు నికితను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
Also Read: బిజెపి అంటే ‘బాబు జనతా పార్టీ’ కాదు పురందేశ్వరి: విజయ సాయి రెడ్డి
- Advertisement -