Monday, December 23, 2024

బాణసంచా గోదాంలో పేలుడు: 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బ్యాంకాక్: దక్షిణ థాయ్‌లాండ్‌లో బాణాసంచా గోదాములో పేలిన ఘటనలో కనీసం 10 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. మలేషియా సరిహద్దులోని నారాతివాట్ ప్రావిన్స్‌లోని మార్కెట్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన పేలుడు ధాటికి 10 ఇళ్లు ధ్వంసమయ్యాయని, సుమారు 100 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి రచ్చాడ థానాడిరెక్ తెలిపారు.

కనీసం 10 మంది మరణించారని, 118 మంది గాయపడ్డారని స్థానిక పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారని వెతుకుతున్నామని అగ్నిమాపక అధికారులు తెలిపారు. క్షతగాత్రులతో సహా 14 మంది పరిస్థితి విషమంగా ఉందని, వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై స్పందించిన ప్రధాన మంత్రి ప్రయుత్ చాన్-ఓ-చా గాయపడిన వారికి సహాయం అందించడానికి సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News