Tuesday, January 21, 2025

పాలమూరు జిల్లాకు ఇచ్చిన హామీలు సిఎం కెసిఆర్ నెరవేర్చాలి

- Advertisement -
- Advertisement -

జిల్లాలో రోజు రోజుకూ పెరుగుతున్న మంత్రి అనుచరుల ఆగడాలు
పార్టీలో పలువురు చేరిక సందర్భంగా టిపిసిసి చీప్ రేవంత్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్ : ఎన్నికల్లో సిఎం కెసిఆర్ పాలమూరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కోరారు. ఆదివారం జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి అనంతరం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్, సాండ్, మైన్,వైన్ ఏ చందాలో చూసినా బిజెపి, బీఆర్‌ఎస్ నేతలే ఉన్నారని ఆరోపించారు. జిల్లా మంత్రి అనుచరులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని చివరకు వక్స్ భూములను సైతం వదలడం లేదని ధ్వజమెత్తారు. పార్టీలో చేరిన వారికి నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. గత ఐదేళ్లుగా అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి ఆశించిన స్ధాయిలో జరగలేదని ఎంపీగా గెలిపిస్తే తన ఇల్లు అమ్మి జిల్లాను అభివృద్ధి చేస్తానని ఉద్యమ సమయంలో చెప్పిన నాయకులు జిల్లాను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో చేరికలు:
జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాధ అమర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు, కౌన్సిలర్ రమాదేవి పలువురు నేతలు చేరారు. జూబ్లీహిల్స్ రేవంత్‌రెడ్డి తన నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News