Friday, November 15, 2024

రాష్ట్రపతికి అధికారాల ఐఐఎంల బిల్లు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోని ఇండియన్ ఇనిస్టూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంల)పై రాష్ట్రపతికి అధికారాలు కల్పించే .నిబంధనల సవరణల బిల్లు వివాదాస్పదం అయింది. ఇందుకోసం ఇప్పటివరకూ ఉన్న చట్టాన్ని సవరించేందుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ బిల్లులో ఐఐఎంఎస్‌ల చట్టానికి సంబంధించి పలు సవరణలు తలపెట్టారు. రాష్ట్రపతి ఈ విద్యాసంస్థల పర్యవేక్షకులుగా ఉంటూ, సంస్థల నిర్వహణ మదింపు అధికారాలను కట్టబెట్టేందుకు వీలేర్పడుతుంది. ఆడిటింగ్, దర్యాప్తులకు ఆదేశాలు, నియామకాలు, డైరెక్టర్ల తొలిగింపుల వంటి ఆధిపత్యం అంతా ఇక రాష్ట్రపతి చేతికి అందేలా బిల్లులోని అంశాలను రూపొందించారు.

దీనితో ఈ ప్రతిష్టాత్మక బి స్కూళ్ల అటానమీ ప్రమాదంలో పడుతుందని విమర్శలు తలెత్తాయి. గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఐఐఎం యాక్ట్ 2017 సవరణల బిల్లును ప్రవేశపెట్టింది. ఓ వైపు మణిపూర్ హింసాకాండపై ప్రతిపక్షాలు సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న దశలోనే ప్రభుత్వం ఈ కీలక బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లుపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలకు దిగింది. ఈ విద్యాసంస్థలపై ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) తన ఆధిపత్యం చాటుకోవడానికే ఈ సవరణల బిల్లు తీసుకువచ్చారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. తమ సైద్ధాంతిక స్వచ్ఛతను ఆపాదించేందుకు పైకి రాష్ట్రపతి పేరు పెట్టి లోలోన తమ ఆధిపత్యం చాటుకుంటారని విమర్శించారు. ఈ బిల్లుతో ఈ సంస్థల అటానమీని లాగేసుకుంటూ వీటికి అధికారాలు లేకుండా చేసి, కేవలం జవాబుదారిని కట్టబెడుతారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News