Thursday, December 26, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:రోడ్డు ప్రమాదంలో ఒకవ్యక్తి మృతి చెందగా, మరొ వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలో జరిగింది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని మల్లన్న నగర్‌కు చెందిన పోలంపల్లి రాము అనేవ్యక్తి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద కాలినడకన రోడ్డు దాటుతుండగా కోదాడ రోడ్ వైపు నుండి బైక్‌పై వచ్చిన ముదిగొండ సురేష్ అనే వ్యక్తి టక్కర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

బైక్ నడుపుతున్న వ్యక్తికి రోడ్డు దాటుతున్న వ్యక్తికి ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన హుజూర్‌నగర్ ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించగా అక్కడి వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్సకై ఖమ్మం తరలించడం జరిగింతని, పోలంపల్లి రాము అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందని సురేష్‌కు సీరియస్‌గా ఉన్నట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్‌నగర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి బార్య పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News