మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: అంతరించిపోతున్న కులవృత్తులకు సిఎం కెసిఆర్ జీవం పో స్తున్నారని రాష్ట్ర, ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వయోలా గార్డెన్లో 303 మందికి బిసి బం ధు పథకం చెక్కులను ఆయన పంపిణీ చేసిన అ నంతరం మాట్లాడారు. ఏ రాష్ట్రంలో లే నివిధంగా 100 శాతం సబ్సిడీపై బిసి బంధు కిం ద లక్ష రూపాయలను ఆర్థ్ధిక సహాయం గా అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించి ఆర్థ్ధికంగా, అండగా నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందన్నారు. ఇప్పటికే రజక, నాయీ బ్రా హ్మణులకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నా రు. స్వ యం ఉపాధి కోసం ఇస్తున్న లక్ష రూపాయలను వృథా చేయకుండా వాడుకోవాలన్నారు. బిసి బం ధు పథకం కింద ఇస్తున్న సహాయం ఆరంభం మాత్రమేనని, దశల వారీగా అర్హులైన వారందరికీ ఈ పథకం చేరుతుందన్నారు.
గత ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఇచ్చినా సబ్సిడీపై ఇచ్చేవారని అదే సిఎం కెసిఆర్ వంద శాతం సబ్సిడీపై అందిస్తున్నారన్నారు. సంబంధం లే కుండానే ఆఫీసుల చుట్టూ తిరగకుండా పైరవీలు లేకుండా నే లక్ష రూపాయలను అందించడం ఎం తో గొప్ప విషయమన్నారు. సిఎం కెసిఆర్ పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి రాష్ట్రంలోని చెరువులు, కుంటలు గోదావరి జలాలతో కుండల్లా ఉ న్నాయన్నారు. అలాగే మిషన్ కాకతీయ కింద చె రువుల పునరుద్ధ్దరణ చేపట్టడంతో మత్స సంపద గణనీయమంగా పెరిగిందన్నారు. ఒకప్పుడు సిద్దిపేటకు విజయవాడ, బెంగుళూర్లాంటి ప్రాంతా ల నుంచి చేపలను ఎగుమతి చేసుకునేవారమని ప్రస్తుతం సిద్దిపేట నుంచే హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు లారీల కొద్ది చేపలను ఎగుమతి చేస్తున్నామన్నారు. మూగ జీవాలకు ఒకప్పుడు నీరు దొరకని ప్రాంతాలలో గోదావరి జలాలు గలగల పారుతున్నాయన్నారు.
మత్సకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీతో పాటు వాహనాలు, వలలు లాంటివి 100 శాతం సబ్సిడీతో అందించడంతో వారి జీవితాలలో కొత్త వెలుగులు వచ్చాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఆనందంగా బతకాలన్నదే లక్షంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 గురుకులాలను సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టి ఉచితంగా నాణ్యమైన విద్యబోధనను అందిస్తున్నారన్నారు. అలాగే గురుకులాలలో జూనియర్, డిగ్రీ కళాశాలలు సైతం ఏర్పాటు చేశామన్నారు. సిద్దిపేటకు అతి త్వరలో డిగ్రీ బిసి గురుకుల కళాశాలను ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. గీత కార్మికుల సొసైటీలను పునరుద్ధరించి అన్నివిధాలుగా అండగా నిలిచిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గౌడ కులస్థ్ధులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ కల్పించింది తెలంగాణలో మాత్రమే నన్నారు. చేనేత కార్మికులకు సైతం వృత్తి పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.
అన్ని కులాల్లో అర్హులైన వారందరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేలా కృషి చేస్తున్నామన్నారు. స్వయం ఉపాధి పొంది ఆర్థ్ధికంగా ఎదగాలన్నదే సిఎం కెసిఆర్ లక్షంగా పెట్టుకున్నారన్నారు. నిరంతరం ప్రజల గురించి ఆలోచించి అండగా నిలుస్తున్న బిఆర్ఎస్ సర్కార్కే ప్రజలు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రజాప్రతినిధులు, నాయకులు మారెడ్డి రవీందర్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కుంబాల ఎల్లారెడ్డి, కోల రమేశ్, ఎడ్ల సోమిరెడ్డి, వంగ ప్రవీణ్‌రెడ్డి, శ్రీహరిగౌడ్, బాల్ రంగం, అల్లం ఎల్లం, మల్లయ్య, బాలమల్లు, హరీశ్, ప్రభాకర్ వర్మ, శ్రీనివాస్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.