Monday, January 20, 2025

జోజిలా సొరంగం పనులు 40 శాతం పూర్తి

- Advertisement -
- Advertisement -

బ్రాస్ (లడఖ్) : ఆసియా లోనే అతి పెద్ద పొడవైన, ఎత్తైన సొరంగ మార్గంగా చెప్పుకునే జోజిలా సొరంగ మార్గ నిర్మాణం పనులు 40 శాతం పూర్తయ్యాయని, భౌగోళిక, వాతావరణ సమస్యలు ఎదురుకావడంతో పనుల పూర్తికి గడువు 2030 వరకు పొడిగించ వలసి వస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. జమ్ముకశ్మీర్‌లడఖ్ మధ్య రవాణా సులభతరం చేసేందుకు ఈ సొరంగం కీలకం కానుంది. దీని పొడవు 14.15 కిమీ కాగా, 13 కిమీ పని పూర్తయింది. ఇంకా మిగతా పనులు పూర్తి చేయడానికి ఈ ప్రాంతమంతా హిమపాతం సంభవించేదని

అందుకే అనేక అవాంతరాలు ఏర్పడుతుంటాయని, దీనివల్ల 2026 డిసెంబర్ నాటికి పూర్తి కావలసిన పనులు గడువు 2030 వరకు పొడిగించ వలసి వచ్చిందని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కెప్టెన్ ఐకె సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం శ్రీనగర్ నుంచి లడఖ్ లోని లేహ్ చేరాలంటే దాదాపు 10 గంటలు పడుతుంది. జోజిలా పాస్ పర్వత మార్గం మీదుగా ప్రయాణానికి మూడు గంటలు పడుతుంది. జోజిలా సొరంగం అందుబాటు లోకి వస్తే కేవలం 20 నిమిషాలే పడుతుందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News