Friday, December 20, 2024

ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి షార్జాకు బయల్దేరిని ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యల కారణంగా సోమవారం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

ఉదయం 10.45 గంటలకు విమానం తిరుచిరాపల్లి నుంచి బయల్దేరిన అనంతరం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీని ఎయిర్‌పోర్టు అథారిటీ ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో విమానం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. విమానంలో మంత్తం 154 మంది ప్రయాణికులు ఉన్నారని, ముందుజాగ్రత్తగా విమానాన్ని తిరువనంతపురంలో ల్యాండ్ చేశామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News