Monday, December 23, 2024

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గ్లింప్స్ విడుదల.. ఊర మాస్ అవతార్ లో విశ్వక్ సేన్

- Advertisement -
- Advertisement -
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రానికి టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. విఎస్11 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ పేరును ఖరారు చేశారు. తాజాగా టైటిల్ తోపాటు మూవీ గ్లింప్స్ కూడా మేకర్స్ విడుదల చేశారు. ‘మేము గోదారోళ్ళం.. మాట ఒకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం’ అంటూ విశ్వక్ సేన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రారంభమైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఇందులో విశ్వక్ సేన్ లుంగీ కట్టుకొని ఊర మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. రాత్రిపూట లారీల్లో అక్రమంగా సరకు తరలించడం, గోదావరి పరిసరాలు, యాక్షన్ సన్నివేశాలతో మూవీపై గ్లింప్స్ ఆసక్తిని పెంచేసింది.
శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య రచనతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల నేపథ్యంలో జరిగిన కథతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జోడీగా నేహా శెట్టి నటిస్తున్నారు. క్రూరమైన ప్రపంచంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదిగిన వ్యక్తిగా విశ్వక్ సేన్ ఈ చిత్రంలో కనువిందు చేయనున్నారు. ఈ సినిమాలో ‘రత్నమాల’ అనే కీలక పాత్రలో అంజలి నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా 2023, డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News